108 అంబులెన్స్‌లో మహిళ ప్రసవం
VKB: పెద్దేముల్ మండలనికి చెందిన గర్భిణి పురిటినొప్పులతో 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా బుధవారం మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. అంబులెన్స్‌ను పక్కకు నిలిపి ఈఎంటీ సంజీవ్, పైలట్ మహేష్ డెలివరీ చేయగా, మహేంద్ర మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని మెరుగైన చికిత్స కోసం వారిని తాండూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.