స్కూల్ బస్సు డ్రైవర్లకు అవగాహన

ELR: ఆగిరిపల్లి గ్రామంలో ప్రైవేట్ విద్యాసంస్థల బస్సు డ్రైవర్లు, క్లీనర్లకు బుధవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. మితిమీరిన వేగం, సామర్ధ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకోవడం అనేక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. డ్రైవింగ్ సమయంలో సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు.