పొంగిన బుగ్గ వాగు..!
KMM: కామేపల్లి మండలం లింగాల నుంచి డోర్నకల్‌కి వెళ్లే మార్గంలో బుగ్గ వాగు పొంగిందని స్థానికులు తెలిపారు. ఆ మార్గంలోని బ్రిడ్జిపై నుంచి వాగు పొంగి ప్రవహిస్తుంది. పొన్నేకల్, బర్లగూడెం, బండిపాడు గ్రామ పంచాయతీల ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. ప్రస్తుతం వాగు ఉద్ధృతి మరింత పెరగడంతో ఖమ్మం నుంచి రాకపోకలు నిలిపివేశారు.