VIDEO: తిరుపతిలో 'చెడ్డి గ్యాంగ్' హల్‌చల్
AP: తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ మరోసారి హల్‌చల్ చేసింది. రూరల్ పీఎస్ పరిధిలోని ఓ ఇంట్లోకి అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. అయితే, ఇంటి యజమాని సునంద కుమార్ రెడ్డి సకాలంలో అప్రమత్తం కావడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దొంగల కదలికలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.