గుంతల రహదారి.. వాహనదారులకు కష్టాలు..!

గుంతల రహదారి.. వాహనదారులకు కష్టాలు..!

VZM: శృంగవరపుకోట మండలంలోని ఎందుర్తి-బొడ్డవర జాతీయ రహదారి నుంచి దబ్బగుంట వరకు రహదారి గుంతలతో అధ్వాన్నంగా మారింది. కాపుసోంపురం మీదుగా వెళ్లే సుమారు 4 కి.మీ మార్గం దెబ్బతినగా, గురువారం వర్షంతో పలుచోట్ల నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు.