గొంతు కోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
BDK: కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలోని ఒక నూడుల్స్ పాయింట్‌లో మాస్టర్‌గా పనిచేసే వెస్ట్ బెంగాల్‌కు చెందిన బిశాల్ తమంగ్ 35(సం) గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అత్యవసర చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. గంటన్నర రెండు గంటలు శ్రమించి డాక్టర్ల బృందం ఇవాళ అతనికి ఆపరేషన్ విజయవంతం చేసి ప్రాణం పోశారు.