గుంటూరు నాజ్ సెంటర్‌లో రోడ్డు నరకం

గుంటూరు నాజ్ సెంటర్‌లో రోడ్డు నరకం

GNTR: గుంటూరు నగరంలోని రద్దీగా ఉండే నాజ్ సెంటర్ ప్రధాన రహదారి మూడు నెలలుగా అధ్వానంగా ఉంది. అస్తవ్యస్తంగా ఉన్న సిమెంటు డివైడర్లు, గుంతల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని, నగర కమిషనర్ స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.