మహిళలకు రేపటి నుంచి స్వయం ఉపాధి శిక్షణ
కృష్ణా: మహిళలకు రేపటి నుంచి స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు నైపుణ్యాభివృద్ధి మహిళా సాధికారత కేంద్రం జిల్లా మేనేజర్ ఎస్.జుబేదా పర్వీన్ తెలిపారు. పామర్రు మండలం నిమ్మకూరు మహిళా సాధికారత కేంద్రంలో 18-35 మధ్య వయసు మహిళలకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ బ్యూటీ తెరపిస్ట్, జనరల్ డ్యూటీ నర్సింగ్ అసిస్టెంట్, మగ్గం వర్క్ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.