రైతుల ఫిర్యాదు.. మంత్రి తక్షణ స్పందన
TG: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులపై రైతు కమిషన్ బృందం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. రసీదులు ఇవ్వకపోవడం, ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో దించే వరకు రైతులనే బాధ్యులుగా చేయడం వంటివి సమస్యలుగా పేర్కొన్నారు. వెంటనే స్పందించిన మంత్రి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు ఫోన్ చేసి.. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.