'ఏజెన్సీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'ఏజెన్సీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ELR: ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాల తీవ్రత కొనసాగుతున్నందున వ్యవసాయ పనుల కోసం వెళ్లే రైతులు, కూలీలు అలాగే ప్రయాణాలు చేసే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.