ప్రభుత్వ భూమిలోని జామాయిల్ నరికివేత

ప్రభుత్వ భూమిలోని జామాయిల్ నరికివేత

NLR: వింజమూరు హైవే వద్ద ఉన్న జాగీర్ వనం సమీపంలోని ప్రభుత్వ భూముల్లో గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా జామాయిల్ మొక్కలు నరికి తరలించారు. సర్వే నంబర్ 839లో సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూమిలోని జామాయిల్ చెట్లను పట్టపగలే నరికి తరలిస్తున్న రెవెన్యూ అధికారులు అటువైపు చూడలేదన్నారు. కాగా, ఇటీవల ఈ భూములను కూడా రెవెన్యూ అధికారులు కార్పొరేషన్‌కు అందించేందుకు సిద్దం చేశారు.