రాజాపేటలో ద్విచక్ర వాహనం చోరీ
BHNG: రాజాపేట మండలం రఘునాథపురానికి చెందిన గుజ్జ జయంత్ ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనం మంగళవారం తెల్లవారుజామున చోరీకి గురైంది. ఉదయం వాహనం కనిపించకపోవడంతో బాధితుడు నిన్న సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు.