రెండో సారి డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే
NGKL: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణను మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఇవాళ పూలమాలలు, శాలువాలతో వంశీకృష్ణకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మోతీలాల్ నాయక్, నాయకులు పర్వత్ రెడ్డి, బాల్‌రాజు, పుల్లయ్య, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.