ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం: బీజేపీ చీఫ్

ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం: బీజేపీ చీఫ్

TG: పొత్తులపై BJP చీఫ్ రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో BJP ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. ఖానాపూర్‌లో BRSతో జరిగిన పొత్తు స్థానిక నాయకుల మధ్య మాత్రమే జరిగిందని.. పార్టీ స్థాయిలో కాదని వివరించారు. తలసరి ఆదాయం ఉంటేనే అసెంబ్లీ సీట్లు పెంచాలని CM రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని రాంచందర్ రావు విమర్శించారు.