11న టెన్నిస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు

ఎన్టీఆర్: ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా టెన్నిస్, సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 11న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్నాయి. అండర్-14, అండర్-17 విభాగాల బాలురు, బాలికలు ఈ పోటీలలో పాల్గొనవచ్చు. క్రీడాకారులు తప్పనిసరిగా స్టడీ సర్టిఫికెట్, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు.