మూస విధానాలకు ముగింపు.. వైవిధ్యానికి ప్రాధాన్యం
NLG: జిల్లాలో మూస పద్ధతిలో సాగుతున్న వరి, పత్తి సాగుకు స్వస్తి పలికి, లాభసాటి పంటల వైవిధ్యం వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఏటా ఒకే రకమైన పంటలు వేయడం వల్ల భూసారం క్షీణించి దిగుబడులు తగ్గుతున్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్, కూరగాయలు, తోటపని పంటలను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది.