ఆస్తమా తట్టుకోలేక ఉరేసుకుని వ్యక్తి మృతి
NDL: మహానంది మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన సున్నం మహేశ్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మహేశ్ కొంత కాలంగా ఆస్తమాతో బాధపడుతున్నాడు. ఎక్కువ కావడంతో ఆదివారం తట్టుకోలేక ఉరేసుకున్నాడు. మృతుడి భార్య ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.