దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేశారు

HNK: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని బుధవారం పరకాలలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి స్థానిక కాంగ్రెస్ నేతలు, ప్రజలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతలు మడికొండ సంపత్ కుమార్, శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో ఐటీ రంగానికి రాజీవ్ గాంధీ పునాదులు వేశారని అన్నారు. భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించి దేశాభివృద్ధికి రాజీవ్ గాంధీ కృషి చేశారని తెలిపారు.