రేపు బనగానపల్లెలో ఎద్దుల బల పోటీలు
NDL: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం బనగానపల్లె మార్కెట్ యార్డులో రాష్ట్ర, అంతర్ రాష్ట్ర స్థాయి నాలుగు పళ్ల ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిర విడుదల చేశారు. రైతులు, పశుపాలకులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.