వైద్య ఆరోగ్య రంగానికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ.13.85కోట్లతో నిర్మించనున్న ఆసుపత్రి భవనానికి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు