VIDEO: ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు: అలవాల కౌసల్య

BDK: బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్‌కు చెందిన అలవాల కౌసల్య అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిపై అక్రమంగా నిర్మాణం జరుగుతున్నా రెవిన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవడంలేదని మీడియా సమావేశంలో బుధవారం పేర్కొన్నారు. అధికారులు నోటీసులు ఇచ్చినా కబ్జాదారులు పట్టించుకోకపోవడం, అడ్డుకునే ప్రయత్నంలో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.