రెండేళ్ల పాలన కాదు రెండేళ్ల మొండిచేయ్యి: హరీష్ రావు
HYD: కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండేళ్ల పాలన కాదు రెండేళ్ల మొండిచేయ్యి అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కడగండ్లకు రెండేళ్లు పూర్తయ్యాయి అన్నారు. కాంగ్రెస్ పాలను గురించి మూడు మాటల్లో చెప్పాలంటే నిస్సారం, నిష్పలం, నిరర్థకం అంటూ.. విమర్శించారు.