కరోనా టీకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
కరోనా టీకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ టీకాలు తీసుకున్న తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తిన వారికి పరిహారం అందించేలా నూతన సమగ్ర విధానాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీకా తీసుకున్న తర్వాత వచ్చే దుష్ప్రభావాలను గుర్తించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న యంత్రాంగాన్నే కొనసాగించాలని సూచించింది.