పనుల జాతర ప్రారంభించిన సింగిల్ విండో ఛైర్మన్

PDPL: గ్రామీణాభివృద్ధికి బాటలు వేసేందుకు ప్రభుత్వం గ్రామాల్లో ఉపాధి పనుల జాతర కార్యక్రమం నిర్వహిస్తుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మండలం పుట్టపాక గ్రామంలో ఉపాధి పనుల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా మహిళలకు ఉపాధి కల్పన, జలనిధి కింద నీటి సంరక్షణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.