వాహనం ఢీకొని వ్యక్తి మృతి
TPT: పెళ్లకూరు మండలంలో చెంబడిపాళెం సమీపంలో జాతీయ రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మధుసూదన్ (45) మృతి చెందాడు. రోడ్డు అవతల తల్లిఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.