తరుణం వంతెనపై నుంచి రాకపోకలు తిరిగి ప్రారంభం

ADB: బోరజ్ మండలంలోని ధర్నం వాగు వంతెనపై నుంచి రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. శనివారం కురిసిన భారీ వర్షానికి వరద నీరు వంతెనను ముంచెత్తడంతో వరద నీరు ఉదృతంగా ఉప్పొంగి ప్రవహించింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం వర్ష ప్రభావం లేకపోవడంతో వాగు ఉధృతి తగ్గుముఖం పట్టండంతో ఎట్టకేలకు వాహనాలు ప్రయాణాలు కోసనాగుతున్నాయి.