'నేడు కలెక్టరేట్లో ప్రత్యేక పీజీఆర్ఎస్'

'నేడు కలెక్టరేట్లో ప్రత్యేక పీజీఆర్ఎస్'

PLD: ఎస్సీ, ఎస్టీల కోసం నిర్వహించే ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి.అరుణ్ బాబు సూచించారు. శనివారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశం అని సద్వినియోగం చేసుకోవాలన్నారు.