'విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి'
MNCL: చెన్నూర్‌లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తు పనులను పరిశీలించారు. పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తు, అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువచ్చేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.