ఎంపీ కలిశెట్టి నేటి పర్యటన వివరాలు
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ ఉదయం 9 గంటల వరకు క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. 11కు స్దానిక బాబా మెట్ట శిల్పారామంనందు జిల్లా తెలగ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ వనభోజన కార్యక్రమానికి హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్ళునున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శనివారం ఓ ప్రకటనలో తెలిపాయి.