'ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'
E.G: వైసీపీలో నూతనంగా పదవులు పొందిన ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ సూచించారు. గురువారం కడియం రూరల్ మండలంలో పార్టీలో పదవులు పొందిన నేతలను ఆయన కలిశారు. గజమాల, ఈ సందర్భంగా ఆయనను నేతలు పూలబొకేలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. తమ గ్రామాల్లో కోటిసంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహించాలన్నారు.