కరకట్టల నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ DCC
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ వద్ద జరుగుతున్న కరకట్టల నిర్మాణ పనులను మాజీ DCC అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మంగళవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. కాలేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పట్టణం వర్షాకాలంలో మునిగిపోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ. 255.59 కోట్లతో కరకట్ట నిర్మాణం జరుగుతుందన్నారు.