మళ్లీ తెరపైకి 'ప్రెసిడెంట్ భారత్' వివాదం

మళ్లీ తెరపైకి 'ప్రెసిడెంట్ భారత్' వివాదం

'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రాలపై 'ఇండియా' పేరు మాయం అయింది. ఇది రాజ్యాంగ విలువలపై దాడి అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విపక్షాల కూటమి 'INDIA' భయంతోనే పేరు మార్చారంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. మార్చి 16 విందు పత్రాల్లో మళ్లీ 'భారత్' అని ఉండటంతో రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.