ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం

ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం

ఖమ్మం జిల్లా మధిర పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మధిర పరిధి నిదానపురం గ్రామంలో తల్లి ఇద్దరు కూతుళ్లను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఓ చోరీ కేసులో తన భర్త షేక్ బాజీని ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్లారని, అవమానం భరించలేక భార్య ప్రేజా(35).. కుమార్తెలు మెహక్ (6), మెనురూల్ (7)ను చంపి తాను ఉరేసుకుని చనిపోయింది.