బస్సులో పొగలు.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

బస్సులో పొగలు.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

KNR: కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సోమవారం అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ వద్ద ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించడంతో పెను ప్రమాదం తప్పింది. వేసవి వేడి కారణంగానే ఇంజిన్ వేడెక్కినట్లు ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు.