జమ్ములమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
GDWL: జమ్మిచేడులోని జమ్ములమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. నడిగడ్డ ఆరాధ్యదైవమైన అమ్మవారిని పూలమాలలు, నిమ్మకాయల మాలలతో విశేషంగా అలంకరించారు. మూడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించినట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.