MLA నాగరాజు రేపటి పర్యటన వివరాలు..!
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిలోని 45వ డివిజన్ పరిధిలోని కడిపికొండ, రాంపేట, కుమ్మరిగూడెం, తరాలపల్లి గ్రామాల్లో సోమవారం (రేపు) వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రోడ్లు & డ్రైనేజీల నిర్మాణ పనులకు MLA శంకుస్థాపన చేయనున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు.