డప్పు కొట్టిన పామర్రు ఎమ్మెల్యే
కృష్ణా: తోట్లవల్లూరు మండలం కొమ్మమూరులో జరిగిన ఉయ్యూరు వీరమ్మ తల్లి ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆదివారం జరిగిన ఊరేగింపు సమయంలో ఆయన డప్పు వాయిద్యం చేసి భక్తులను-అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సమయంలో యువత కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపును చూడటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.