నేడు దుర్గమ్మ వెండి ఆభరణాల లెక్కింపు
NTR: విజయవాడ దుర్గమ్మ గుడిలో నిన్న ఆభరణాల లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. రీజినల్ గోల్డ్ అప్రైజర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు అధికారులు బంగారు ఆభరణాలను లెక్కించారు. కాగా, ఇవాళ వెండి ఆభరణాలు లెక్కించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపు పూర్తయిన అనంతరం వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.