సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మూడా ఛైర్మన్

MBNR: మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని వార్డు నెంబర్ 37 సద్దల గుండు ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ప్రతి కాలనీలో కూడా నూతన రోడ్డులను నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.