నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడీఈ కిరణ్ చైతన్య తెలిపారు. సబ్ స్టేషన్‌లో మరమ్మతుల చేపట్టనున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.