'మహిళలకు ఇచ్చిన హామీకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'

ప్రకాశం: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. గురువారం పొదిలి డిపోలో ఆర్టీసీ శ్రీ శక్తి పథకం బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శంకర్రావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.