ఎంపీలపై నిప్పులు చెరిగిన షర్మిల
AP: ఏపీ విభజన హామీలు, ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో గళమెత్తిన కాంగ్రెస్ MP మాణిక్కం ఠాగూర్‌కు PCC చీఫ్ వైఎస్ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీలపై ఆమె నిప్పులు చెరిగారు. పక్క రాష్ట్ర ఎంపీకి ఉన్న చిత్తశుద్ధి మన ఎంపీలకు లేకపోవడం సిగ్గుచేటన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.