సీఎం కప్‌లో కరీంనగర్ జిల్లా తృతీయ స్థానం
KNR: రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడల్లో కరీంనగర్ జిల్లా ఓవరాల్‌గా తృతీయ స్థానంలో నిలిచి సత్తా చాటింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకల్లో క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా జిల్లా ప్రతినిధులు ట్రోఫీ అందుకున్నారు. 79.4 పాయింట్లతో కరీంనగర్ ఈ విజయం సాధించగా.. ఆదిలాబాద్ ప్రథమ, రంగారెడ్డి ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.