ఆలయ అభివృద్ధికి భారీ విరాళం

ఆలయ అభివృద్ధికి భారీ విరాళం

ATP: గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామ ఊరు దేవర సందర్భంగా ఆలయ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద రెడ్డి భారీ విరాళం ప్రకటించారు. గ్రామ పెద్దల సమక్షంలో రూ.1.50 లక్షల నగదును ఆలయ కమిటీకి అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, ధార్మిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని గోవింద రెడ్డి పేర్కొన్నారు.