కాలేజీ యాజమాన్యాలతో ఎక్సైజ్ అధికారుల భేటీ
W.G: మాదక ద్రవ్యాలైన గంజాయి, డ్రగ్స్ వినియోగంపై కళాశాల యాజమాన్యాలు అవగాహన కలిగి ఉండాలని తణుకు ఎక్సైజ్ సీఐ సత్తి మణికంఠరెడ్డి అన్నారు. తణుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ తణుకులోని ఎస్.ఎం.వి.ఎం పాలిటెక్నిక్ కాలేజ్, ఎస్.సీ.ఐ.ఎం కాలేజీ, శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ తదితర కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఎక్సైజ్ అధికారులు భేటీ అయ్యారు.