'ప్రజావాణికి అధికారుల గైర్హాజరు'

'ప్రజావాణికి అధికారుల గైర్హాజరు'

VKB: ప్రజావాణికి అధికారులంతా గైర్హాజరు కావడంతో ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నాయి. సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి అధికారులు డుమ్మా కొట్టడంతో సంబంధిత శాఖల అధికారులు లేకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు ఎవరు కూడా ప్రజావాణికి రావడం లేదని ఎంపీడీవో వినయ్ కుమార్ తెలిపారు.