PSని తనిఖీ చేసిన డీసీపీ

PSని తనిఖీ చేసిన డీసీపీ

PDPL: రామగుండం సమీపంలోని ధర్మారం పోలీస్ స్టేషన్‌ను డీసీపీ బి. రామ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో కేసుల నమోదు, దర్యాప్తు విధానం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై పోలీసు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని, విధుల నిర్వహణలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.