VIDEO: శ్రీరామ నవమికి దేవాలయ ముస్తాబు
MNCL: లక్షెట్టిపేట మండలంలోని ఉన్న దేవాలయాలు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముస్తాబవుతున్నాయి. శుక్రవారం శ్రీరామనవమి నేపథ్యంలో మండలంలోని పాత కొమ్ముగూడెం గ్రామంలో ఉన్న హనుమాన్ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. గ్రామ సర్పంచ్ దుమ్మని సత్తయ్య, హనుమాన్ భక్తులు కలిసి దేవాలయం ఆవరణలో మొక్కను నాటారు. పలు గ్రామాలలో ఉన్న రామాలయాలు, హనుమాన్ దేవాలయాలను ముస్తాబు చేశారు.