'ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా'

'ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా'

SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా అని నరసన్నపేట ఎమ్మెల్యే రమణ మూర్తి అన్నారు. కత్తిరివానిపేట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్‌ను శుక్రవారం నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.