విశాఖ పరిశుభ్రతపై నటుడు శ్రీకాంత్ ప్రశంసలు
VSP: స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో విశాఖపట్నం సాధించిన విజయంపై నటుడు శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. నగరం పరిశుభ్రతను కాపాడడంలో ఆదర్శంగా నిలిచిందని ఆయన అభినందించారు. మన ఇళ్లను శుభ్రంగా ఉంచుకున్నట్లే వీధులు, బీచ్‌లు, ప్రజా ప్రదేశాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తుచేశారు.